Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Panchayat 5 | భారతీయ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ 'పంచాయత్' (Panchayat) తన ఐదో సీజన్‌తో మరోసారి వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది.
భారతీయ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ ‘పంచాయత్’ (Panchayat) తన ఐదో సీజన్‌తో మరోసారి వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్, డిసెంబర్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈసారి ఫులేరా గ్రామ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో క్రాంతి దేవి (సునీతా రాజ్వర్) విజయం సాధించడంతో, ఇన్నాళ్లు సర్పంచ్‌గా కొనసాగిన మంజు దేవి (నీనా గుప్తా) అధికారాన్ని కోల్పోయారు. ఫలితంగా గ్రామంలో కొత్త నాయకత్వం ఏర్పడగా, క్రాంతి దేవి భర్త బన్రాకస్ (దుర్గేష్ కుమార్) కొత్త ‘ప్రధాన్పతి’గా తన ఆధిపత్యాన్ని చెలాయించడం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
చందన్ కుమార్ కథ అందించిన ఈ సిరీస్‌కు దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, సాన్వికలతో పాటు ఫైజల్ మాలిక్ (ప్రహ్లాద్ చా), చందన్ రాయ్ (వికాస్), దుర్గేష్ కుమార్, సునీతా రాజ్వర్, అశోక్ పాఠక్ (బినోద్), బుల్లూ కుమార్, పంకజ్ ఝా తదితరులు తమ సహజ నటనతో మరోసారి అలరించనున్నారు. గ్రామీణ నేపథ్యం, సున్నితమైన హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో సాగే ఈ ఐదో సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

