వానకాలం కొనుగోళ్లు.. 9 లక్షల టన్నులు

- దిగుబడి అంచనా కోటి టన్నులు.. సాగు 62 లక్షల ఎకరాలు
- ఆరేండ్ల నుంచి సజావుగా సాగుతున్న కొనుగోళ్లు..
- ఇంత పక్కాగా కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం మనదే
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారినప్పటినుంచి ఏ యేటికాయేడు ధాన్యం దిగుబడి పెరుగుతున్నట్టే.. ధాన్యం కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఏడేండ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు కూడా చేరుతున్నాయి. కరోనా వంటి మహమ్మారి పంజాతో ఆపత్కాలం దాపురించినప్పుడు సైతం.. లాక్డౌన్ వంటి నిర్బంధాలు ఎన్ని ఉన్నప్పటికీ.. మార్కెట్‌యార్డులను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. దేశంలోనే మొట్టమొదటిసారి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొని భారత ఆహార సంస్థకు అందించింది. కరోనా కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయజాలని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇంత పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఈ వానకాలంలో 61.94 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. కోటి టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనావేస్తున్నారు. ఈ వానకాలానికి కేంద్ర ప్రభుత్వం 60 లక్షల టన్నులు సేకరించడానికి అంగీకరించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 4569 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. సోమవారం వరకు 9.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 1.44 లక్షల మంది రైతుల నుంచి రూ.1,844 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

