ఈరోడ్: తమిళనాడులోని ఈరోడ్‌లో సుమారు 1400 కేజీల నిషేధిత గుట్కా ఐటమ్స్‌ను సీజ్ చేశారు. కర్నాటక నుంచి బర్గూరు హిల్స్ రూట్లో అక్రమ రీతిలో తమిళనాడులోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కర్నాటక రిజిస్ట్రేషన్‌తో వచ్చిన టెంపో, కారును బర్గూరు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఆ వాహనాల్లో సుమారు 13 లక్షల ఖరీదైన గుట్కా ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించారు. ఐపీసీలోని 273, 328 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో మొత్తం ఏడు మందిని అరెస్టు చేశారు.