ఉస్మానియా యూనివర్సిటీ విద్యా సమాచారం

జియో ఫిజిక్స్‌లో మూడేండ్ల పీజీ: ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16: ఓయూ జియో ఫిజిక్స్ విభాగంలో మూడేండ్ల పీజీ కోర్సును పునరుద్ధరిస్తామని వీసీ ప్రొఫెసర్ రవీందర్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి కోర్సును రెండేండ్లకు కుదించారని పేర్కొన్నారు. ‘భవిష్యత్ సవాళ్ల కోసం జియోఫిజిక్స్ విద్య పునరుద్ధరణ – సెంటర్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్ పాత్ర’ అంశంపై మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో వీసీ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులుచేస్తూ కోర్సును పునరుద్ధరించనున్నట్టు తెలిపారు. .
డీడీఎంఎస్ లిటరసీలో సర్టిఫికెట్ కోర్సులు
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16: ఓయూ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో ట్యాక్సేషన్, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్- ఇంటర్నెట్ (ఆఫీస్ ఆటోమేషన్), ట్యాలీ- ఈఆర్పీ-9, యోగా, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జూట్ బ్యాగ్ మేకింగ్, హెయిర్ ైస్టెలిస్ట్, ఇతర కోర్సులైన టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, గ్రాఫిక్స్ డిజైనింగ్, మీడియా రైటింగ్ ఇన్ తెలుగు వంటి ఆన్లైన్ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నట్టు అధికారులు తెలిపారు. 25లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 8498080599, 9951210441, 7013457432 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వెబ్సైట్లో నెట్ హాల్ టికెట్లు
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) హాల్ టికెట్లను అభ్యర్థులు ugcnet.nta.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2021 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ తెలిపింది.
సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు
కాచిగూడ, నవంబర్ 16: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ మేనేజ్మెంట్ కోర్సులకు ఆన్లైన్లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చని టీసేవ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. వివరాలకు 7893141797 లేదా www.nacsindia.orgలో సంప్రదించవచ్చని సూచించారు.
పీజీ డిప్లొమా ఇన్ లా నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూలోని డిపార్టుమెంట్ ఆఫ్ లా ఆధ్వర్యంలో 2021-22 విద్యాసంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ లాలో ఆరు రకాల (సెల్ఫ్ ఫైనాన్స్) కోర్సులకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి బుధవారం నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి రెండో తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. వివరాలకు 04027682368/ 23231092 లేదా 7997434217 లేదా www.osmania.ac.in లో సంప్రదించవచ్చు.
ఇఫ్లూ పీహెచ్‌డీలకు 2 నుంచి ఇంటర్వ్యూ
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 16: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో పీహెచ్డీ ప్రవేశాలకు వచ్చేనెల 2 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వివరాలకు www.efluniversity.ac.in చూడాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

