TTD | శాస్త్రోక్తంగా కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
TTD | శాస్త్రోక్తంగా కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు | నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు యాగశాలలో

తిరుమల : నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కొవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
అనంతరం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు స్వామి, అమ్మవారి మూలమూర్తులకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈఓ పార్వతి, వైఖాసన ఆగమ సలహాదారు విష్ణుభట్టాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

