Attack | మహిళలను వివస్త్రలను చేసి కొట్టిన NSUI అధ్యక్షుడు.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
Attack | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jublihills Bye Elections) ప్రచారం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు. గత మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగింది.
Attack | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jublihills Bye Elections) ప్రచారం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు. గత మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగింది. మహిళలపై NSUI అధ్యక్షుడు వెంకటస్వామి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై కోపంతో వెంకటస్వామి మహిళలపై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం రహ్మత్‌నగర్ డివిజన్లోని బ్రహ్మశంకర్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఉన్నారని ఒక మైనర్‌తోపాటు ముగ్గురు మహిళలపై వెంకటస్వామి తన అనుచరులతో కలిసి దాడిచేశాడు. స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి వర్గంపై కోపంతో.. ఆయన మనుషులు తనకు అడ్డుగా ఉన్నారని వారిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వెంకటస్వామి ఇండ్లలోకి దూసుకెళ్లి, మహిళలని కూడా చూడకుండా వివస్త్రలను చేసి కొట్టాడని స్థానిక కాంగ్రెస్ నాయకులే ఆరోపిస్తున్నారు.
వెంకటస్వామి దాడిలో గాయపడిన ఈశ్వరమ్మ, రజిత, మీనాక్షి అనే మహిళలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని స్థానిక బస్తీ కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

