Home Loan | హోమ్‌లోన్‌పై టాప్-అప్కెళ్తారా?
గృహ రుణగ్రహీతలకు టాప్-అప్ లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టంట్‌గా, ఈజీగా లభిస్తాయివి. తక్కువ వడ్డీరేటుతో, సులభ వాయిదా చెల్లింపుల పద్ధతితో, సౌకర్యవంతంగా ఉండే ఈ రుణాలు.. హోమ్ లోన్ సెగ్మెంట్లో ఎంతో పాపులర్.
Home Loan | గృహ రుణగ్రహీతలకు టాప్-అప్ లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టంట్‌గా, ఈజీగా లభిస్తాయి. తక్కువ వడ్డీరేటుతో, సులభ వాయిదా చెల్లింపుల పద్ధతితో, సౌకర్యవంతంగా ఉండే ఈ రుణాలు.. హోమ్ లోన్ సెగ్మెంట్లో ఎంతో పాపులర్.
టాప్-అప్ లోన్స్ అంటే?
మీరు ఇప్పటికే ఓ గృహ రుణం తీసుకున్నారనుకుందాం. నాలుగైదేండ్లు, అంతకుమించో ఈఎంఐ చెల్లిస్తున్నారు. అయితే మీ ట్రాక్ రికార్డ్ బాగుంటే మీకు రుణాలిచ్చిన సంస్థలు వెంటపడిమరీ టాప్-అప్ లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. మొబైల్ ఫోన్ రిచార్జ్ చేసుకున్నప్పుడు ఏదైనా ఆఫర్ లేదా సర్వీస్ కోసం టాప్-అప్ రిచార్జ్ చేసుకున్నట్టే ఇదికూడా. ఇప్పటికే ఉన్న గృహ రుణంపై అదనంగా మరో రుణం ఇవ్వడమే టాప్-అప్ లోన్. ఇంటి రినోవేషన్ లేదా కొత్త ఫర్నీచర్ కొనుగోలు, పెయింటింగ్ చేసుకోవడం, హోమ్ ఇంప్రూవ్మెంట్ వంటివాటి కోసం ఈ టాప్-అప్ లోన్లకు వెళ్లవచ్చు. దీనికి ప్రత్యేకంగా మరో ఖాతా మొదలవుతుంది. దాని ఈఎంఐ కూడా వేరేగానే ఉంటుంది.
ఎంత రుణం లభిస్తుంది?
ఉదాహరణకు మీరు 15 ఏండ్ల కాలపరిమితితో రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్నారనుకుందాం. ఐదేండ్లలో ఈఎంఐల ద్వారా రూ.8 లక్షలు చెల్లించారని లెక్కిద్దాం. ఇప్పుడు మీ లోన్ గడువు ఇంకా పదేండ్లుంది. దీంతో ఇప్పటికే చెల్లించిన రూ.8 లక్షలను మళ్లీ పదేండ్లకుగాను టాప్-అప్ లోన్‌గా రుణదాతలు ఇవ్వవచ్చు. అలాగే పెరిగిన మీ ఆదాయాన్నిబట్టి కూడా టాప్-అప్ లోన్‌ను ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు. కానీ మీ వయసుకు లోబడే రుణ కాలపరిమితి ఉంటుంది. అంతేగాక మీ రుణదాత పాలసీ, మీ వ్యక్తిగత స్థోమతనుబట్టి ఎన్నిసాైర్లెనా ఈ టాప్-అప్ లోన్లు తీసుకోవచ్చు.
వడ్డీరేటు ఎంత?
ఇప్పుడున్న హౌజింగ్ లోన్‌పై పడుతున్న వడ్డీనే దీనికీ వర్తింపజేస్తారు. తక్కువ వడ్డీరేటు కావడం వల్లే చాలామంది వీటికి ఆకర్షితులవుతున్నారు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రుణాలకు బదులు వీటిని ఎంపిక చేసుకుంటున్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండటం మరొక కలిసొచ్చే అంశం. గరిష్ఠంగా రూ.30,000 వరకు ఉంటుంది. కాగా, ఇప్పటికే ఉన్న కస్టమర్ కాబట్టి రుణదాతలు కూడా టాప్-అప్ లోన్లను త్వరితగతినే మంజూరు చేస్తారు. పెద్దగా డాక్యుమెంట్లతో పని ఉండదు. నిధుల వినియోగంపైనా ఆంక్షలుండవు. గృహ రుణంలో మాదిరిగానే నగదు ఉన్నప్పుడు ఈ టాప్-అప్ లోన్‌నూ ముందుగానే తీర్చేయవచ్చు. పైగా ఇటీవలికాలంలో ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం వచ్చింది. క్రెడిట్ కార్డ్ తరహాలో వాడుకున్న నగదుకు మాత్రమే వడ్డీ చెల్లింపుల్ని చేసుకోవచ్చు.
చివరగా..
టాప్-అప్ లోన్లను వీలున్నంత తొందరగా తీర్చేసుకుంటే రుణ భారం తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలం వడ్డీ భారాన్ని తప్పించుకోవచ్చు. అవసరం ఉన్నంత మేరకే అప్పు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం.
-నాగేంద్ర సాయి కుందవరం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

