రెండేళ్లుగా రూ.2000 నోటు ముద్రించడం లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని సోమవారం లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని కూడా ఠాకూర్ తెలిపారు. ప్రజల లావాదేవీల డిమాండ్ మేరకు ఓ డినామినేషన్ బ్యాంక్ నోట్ల ముద్రణపై ఆర్బీఐతో సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
2019-20, 2020-21లలో రూ.2000 నోటు ముద్రించలేదని వెల్లడించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 354.2 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించినట్లు 2019లో ఆర్బీఐ తెలిపింది. అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను తగ్గించి, తద్వారా నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే వీటి ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2016లో నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం తొలిసారి రూ.2000 నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

