బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరించం
- కేంద్ర మంత్రి చౌహాన్
న్యూఢిల్లీ, మార్చి 23: టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభకు బుధవారం ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ 2020లో సంస్థ ఉద్యోగులకు ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కారణంగా బీఎస్ఎన్ఎల్ అందించే సర్వీసుల్లో ఎటువంటి లోపం, జాప్యం ఉండటం లేదన్నారు. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య సంస్థ కార్యకలాపాలకు సరిపోయేంతగా ఉన్నదన్నారు. బీఎస్ఎన్ఎల్కు ఉన్న భవనాలు, స్థలాలు, టవర్లు, టెలికం పరికరాలు, టెలికంయేతర పరికరాలు తదితర స్థిరాస్తుల విలువ 2021 మార్చి 31నాటికి రూ.89,878 కోట్లుగా ఉన్నట్టు మంత్రి వెల్లడించారు.
దేశీ మొబైల్ చందాదారుల్లో బీఎస్ఎన్ఎల్ వాటా 2021 డిసెంబర్ 31నాటికి 9.90 శాతమని, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల్లో 15.40 శాతం వాటా ఉన్నదన్నారు. వీఆర్ఎస్ అమలు, 4జీ సర్వీసులకు బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిధులు లభించడం, రుణం తగ్గించుకోవడానికి, మూలధన వ్యయాన్ని సమకూర్చుకోవడానికి కొన్ని ఆస్తుల్ని విక్రయించడం, సావరిన్ గ్యారంటీ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులతో రుణాల్ని పునర్వ్యవస్థీకరించడం తదితర చర్యల ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆపరేటింగ్ లాభాన్ని ఆర్జించగలిగిందని చౌహాన్ వివరించారు.
అమ్మేస్తేనే విశాఖ ఉక్కుకు శ్రేయస్కరం
విశాఖ ఉక్కుగా ప్రాచుర్య పొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)లో ప్రభుత్వ వాటాను విక్రయిస్తేనే ఆ సంస్థకు మంచిదని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్ఐఎన్ఎల్ను డిజిన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలోకి తాజా మూలధనం వస్తుందని, సామర్థ్యం విస్తరిస్తుందని, టెక్నాలజీ, మెరుగైన యాజమాన్య నిర్వహణా పద్దతులు వస్తాయని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ బుధవారం పార్లమెంట్‌కు వివరించారు. గత పదేండ్లుగా ఆర్ఐఎల్ఎన్ లాభాల్ని పెంచుకోలేకపోతున్నదని, నష్టాలు రూ. 7,122 కోట్లకు పేరుకున్నాయన్నారు. ఆర్ఐఎన్ఎల్, దాని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో మొత్తం వాటా ను విక్రయించేందుకు గత ఏడాది జనవరిలో క్యాబినెట్ సూత్రప్రాయంగా అనుమతించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

