సివిల్స్ అభ్యర్థులకు సుప్రీం షాక్.. ఎక్స్ట్రా ఛాన్స్ ఇవ్వని కోర్టు

న్యూఢిల్లీ: యూపీఎస్సీ అభ్యర్థులకు అదనపు అవకాశం ఇవ్వడం లేదని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో సివిల్స్ పరీక్ష రాయలేకపోయిన వారికి ఎటువంటి ఎక్స్ట్రా ఛాన్సు ఉండదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. కరోనా వైరస్ ఆంక్షల వల్ల సివిల్స్ పరీక్ష రాయలేకపోయామని, మరో అవకాశం కల్పించాలంటూ సుప్రీంలో అభ్యర్థన దాఖలైంది. ఆ కేసులో ఇవాళ సుప్రీం విచారణ చేపట్టింది. ఆ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ఇవాళ ఏక వ్యాఖ్య తీర్పునిచ్చింది. 2020 నాటికి చివరి అవకాశం కోల్పోతున్న వారికి మరోసారి సివిల్స్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలుత అంగీకరించింది. కానీ ఆ నిర్ణయాన్ని సుప్రీంకు వదిలేసింది. కరోనా మహమ్మారి వల్ల పరీక్షలకు సరిగా ప్రిపేర్కాలేకపోయామని, అందుకే మరో ఛాన్సు ఇవ్వాలంటూ పిటీషనర్ తన అభ్యర్థనలో కోర్టును కోరారు. వయసు మీరుతున్న వారికి కూడా మరో అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
Tragedy | ఘోరం.. ఇనుపకడ్డీలు మీదపడి డిగ్రీ విద్యార్థిని మృతి
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

