హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వయసులో చిన్నదే అయినా.. అభివృద్ధిలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా 9 శాతానికిపైగా వృద్ధి సాధిస్తుందని కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
అర్త్ నీతి నివేదికను జత చేశారు. ‘దేశంలోనే పిన్న రాష్ట్రమైన తెలంగాణ నూతన పాలసీలు, పరిశ్రమలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 9 శాతానికి తగ్గకుండా అభివృద్ధి సాధిస్తున్నది’ అని పేర్కొన్నారు. అర్త్నీతి ఆగస్ట్ నివేదికలో తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేకంగా వివరించారు.