ప్రమాదంపై స్పందించిన యువ హీరో నిఖిల్

యువ హీరో నిఖిల్ .. కార్తికేయ2 షూటింగ్లో గాయపడ్డ సంగతి తెలిసిందే. గుజరాత్లో మూవీకి సంబంధించి ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా, నిఖిల్ ఎడమ కాలుకు గాయమైంది. ఈ విషయంపై తాజాగా నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నాకు ప్రమాదం జరిగిందని తెలుసుకొని చాలా మంది ఫోన్స్, మెసేజ్‌లు చేస్తున్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. రెట్టింపు ఉత్సాహంతోనే త్వరలో మీ ముందుకు వస్తాను అంటూ నిఖిల్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న కార్తికేయ 2 చిత్రం ఏడేళ్ళ క్రితం వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్‌గా రూపొందుతుంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యానిమల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌తో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 2021లోనే సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anupam Kher
- Kartikeya-2
- Nikhil
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

