న్యూజిలాండ్‌ను జట్టు కెప్టెన్ విలియమ్సన్ ఆదుకుంటున్నాడు. విలియమ్సన్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. 36 బంతుల్లో 55 పరుగులు చేశాడు విలియమ్సన్. 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 114 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్, ఫిలిప్స్ ఉన్నారు. ఫిలిప్స్ 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో హజిల్‌వుడ్ 3 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. కేవలం 11 పరుగులే ఇచ్చాడు. ఆడమ్ జంపా.. 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.