కరోనాకు కొత్త పరీక్ష.. సెలైన్ పుక్కిలిస్తే చాలు 3 గంటల్లో ఫలితం

న్యూఢిల్లీ: సులభమైన కరోనా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. సెలైన్ నోటిలో వేసుకుని పుక్కిలించి ఓ ట్యూబులో ఉమ్మాలి. ఆ ట్యూబును పరీక్షకు పంపితే చాలు.. మూడు గంటల్లో ఫలితం వస్తుంది. ఈ కొత్త పరీక్ష వల్ల సమయం, సాధన సంపత్తి ఆదా అవుతాయి. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఈ చవకైన, సులభమైన కొత్త పరీక్షను రూపొందించింది. ఈ కిట్ లో ఉంటే సెలైన్‌ను గొంతులో పోసుకుని 15 సెకన్ల పాటు పుక్కిలించాలి. తర్వాత ఆ ద్రవాన్ని ట్యూబులోకి ఉమ్మాలి. ఆ ట్యూబును ప్రయోగశాలకు పంపితే ఫలితం వస్తుంది. కరోనా రక్షణ దుస్తులు, దూదిపుల్లలు ఇలాంటివేవీ ఈ పరీక్షలో అవసరం లేదు. ఇదొక గమనించదగ్గ నూతన ఆవిష్కరణ అని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వ్యాఖ్యానించారు. దూదిపుల్ల అవసరం లేని, ఇబ్బంది కలిగించని ఈ విధానం కరోనా పరీక్షల తీరుతెన్నులనే మార్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి వారే శాంపిల్స్ సేకరించి పంపవచ్చునని, జనాల మధ్య క్యూలో నిలబడి అవస్థలు పడాల్సిన అగత్యం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతిలో వ్యర్థాలు కూడా తగ్గుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైద్య పరిశోధన జర్నల్‌లో ఈ కొత్త పరీక్ష గురించి ఇటీవలే ఒక అధ్యయన నివేదికను ప్రచురించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

