విద్యాశాఖ అధికారులపై ఎస్టీ కమిషన్ ఆగ్రహం
తన స్వస్థలానికి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్న గిరిజన మహిళా ఉద్యోగి ఎదురొంటున్న ఇబ్బందులపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ తీవ్రంగా స్పందించింది. దూర ప్రాంతంలో పనిచేయడం వల్ల కుటుంబ, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతున్నాయని, తనను సమీప ప్రాంతానికి డిప్యుటేషన్‌పై పంపాలని మహిళా ఉద్యోగి కొంతకాలంగా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తిచేశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో న్యాయం కోసం జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు.
- డిప్యుటేషన్‌పై మానవత్వంతో వ్యవహరించాలని ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తన స్వస్థలానికి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్న గిరిజన మహిళా ఉద్యోగి ఎదురొంటున్న ఇబ్బందులపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ తీవ్రంగా స్పందించింది. దూర ప్రాంతంలో పనిచేయడం వల్ల కుటుంబ, వ్యక్తిగత సమస్యలు తలెత్తుతున్నాయని, తనను సమీప ప్రాంతానికి డిప్యుటేషన్‌పై పంపాలని మహిళా ఉద్యోగి కొంతకాలంగా విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తిచేశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో న్యాయం కోసం జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. తన గోడును వినిపించారు. బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్‌నాయక్ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలను కేవలం నిబంధనల చట్రంలోనే కాకుండా, మానవతా దృక్పథంతో పరిశీలించి పరిషరించాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

