Errolla Srinivas | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
Errolla Srinivas | బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Errolla Srinivas | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో ఇవాళ మధ్యాహ్నం హాజరుపరిచిన సంగతి తెలిసిందే. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీనివాస్‌ను మూడు సార్లు విచారణకు పిలిచామని, విచారణకు రాకపోవడంతోనే గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, క్రాంతి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్లోనే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి పరామర్శించారు. శ్రీనివాస్‌ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | బీసీలంటే లెక్క లేదా..? బీసీ కులగణనపై బీజేపీ వైఖరి చెప్పాలి.. ఎమ్మెల్సీ కవిత డిమాండ్
Rains | తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
Telugu Youth | ఆస్ట్రేలియాలో తెలుగు యువకుడు అస్రిత్ దేవళ్ల ప్రతిభకు ప్రతిష్ఠాత్మక అవార్డు
Brakes fail Vande Bharat travels | బ్రైక్స్ ఫెయిల్ అయిన వందే భారత్ రైలు 463 కిలోమీటర్లు ప్రయాణం.. దర్యాప్తునకు రైల్వే ఆదేశం
IND vs NZ | కివీస్‌పై భారత్ సంచలన విజయం.. ఏడేళ్ల రికార్డు బద్దలు!
Dhanush | మమ్ముట్టిపై నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.. మెగాస్టార్‌పై ధనుష్ ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

