ఆనందం అంబరాన్ని తాకితే..

ఈ ఏడాది ‘లవ్‌స్టోరీ’ సినిమా విజయంతో జోరుమీదున్నారు యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. మంగళవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, అవికాగోర్, మాళవికా నాయర్ కథానాయికలు. ఫస్ట్‌లుక్‌లో నాగచైతన్య కళ్లద్దాలు ధరించి రంగులరాట్నంలోని గుర్రంపైకెక్కి కూర్చొని కనిపిస్తున్నారు. ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోతున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇందులో నాగచైతన్య మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహణం, తమన్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: బి.వి.ఎస్.రవి, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

