Telangana | ‘బిడ్డా…మన వాకిట్లనే మంచినీళ్లు దొరికినట్టు కలచ్చిందే…’ అన్నది మల్లవ్వ. ‘అయ్యేటి కలలు కనరాదే అవ్వ… నడువ్ ముందు’ అంటూ ఒకచేతిలో బిందె మరో చేతిలో బకెట్ పట్టుకుని పరుగుదీసింది గంగవ్వ. అవును ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెపడుచుల కల ఇది. గొంతు తడవాలంటే పెద్దవాళ్లే కాదు, ఏడెనిమిదేళ్ల బిడ్డలూ నీళ్ల కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. అప్పటి మోయలేని ఆ బరువైన బతుకుల్ని సూచిస్తుంది…నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోకల్దాస్ తండా దగ్గరిదీ చిత్రం.
మరో పక్క… అచ్చం మల్లవ్వలాంటి కలే ఉద్యమ నాయకుడు కేసీఆర్ కన్నారు. ఒక్క ఆ గ్రామానికే కాదు… తెలంగాణ పల్లెపల్లెనా ఇంటి ముందు మంచినీళ్ల సవ్వడి వినిపించాలని ఆశపడ్డారు. గ్రామాలు, పట్టణాలే కాదు, లంబాడీ తండాలూ, ఆదివాసీ గూడేల్లోనూ ఏ ఆడబిడ్డా తల మీద బిందె ఎత్తాల్సిన పరిస్థితే లేకుండా చేశారు. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీటిని వాకిట్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు అదే కోకల్దాస్లోని లంబాడాలు నల్లాపైపులతో బిందెల్లో నీళ్లు సంతోషంగా నింపుకొంటున్నారు.