Lottery Fraud | లాటరీ పేరిట మోసం.. రూ.2 లక్షలు పోగుట్టుకున్న ముంబైవాసి
లాటరీలో రూ.10.4 లక్షల విలువైన కారు గెలుచుకున్నారంటూ ఫోన్
Lottery Fraud : లాటరీ పేరిట జరిగే కొందరు భారీ మోసాలకు పాల్పడుతుంటారు. బహుమతి గెలుచుకున్నారని ఫోన్ చేసి, ఆ ప్రైజ్ దక్కాలంటే కొంత డబ్బు కట్టాలని చెప్తారు. తీరా డబ్బు కట్టాక మోసగాళ్లు ప్లేటు ఫిరాయిస్తారు. ముంబైలో అలాంటి సంఘటనే జరిగింది. లక్కీ డ్రాలో బహుమతి గెలిచారని చెప్పి ముంబైలోని బోరివలీ ప్రాంతానికి చెందిన ఒకాయన దగ్గర గుర్తు తెలియని వ్యక్తి రెండు లక్షలు కాజేశాడు. లాటరీలో రూ.10.4 లక్షల విలువైన కారు గెలుచుకున్నావని అతడికి చెప్పాడు. ఆ కారు సొంతం చేసుకోవాలంటే రూ.2.10 లక్షలు కట్టాలని చెప్పడంతో అతను డబ్బు ఆన్లైన్లో చెల్లించాడు. డబ్బు కట్టినా కూడా కారు పంపించకపోవడంతో తాను మోసపోయినట్టు గ్రహించాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
2019లో సదరు వ్యక్తి ఆన్లైన్లో ఒక వస్తువు కొన్నాడు. రెండేళ్ల తర్వాత మీరు లక్కీ డ్రాలో బహుమతి గెలుచుకున్నారు అంటూ అతడు వస్తువు కొనుగోలు చేసిన ఆన్లైన్ సంస్థ పేరుతో వెస్ట్‌బెంగాల్ నుంచి అతనికి ఒక లెటర్ వచ్చింది. అందులో స్క్రాచ్ కార్డు ఉంది. అందులో మీరు రూ.10.24 లక్షల కారు గెలిచారని ఉంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పేరుతో ఒకతను ఫోన్ చేసి, ఆ కారు కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కిం రూ.2.10 లక్షలు తన అకౌంట్‌కు పంపించాలని చెప్పాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

