Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్పై జరిగిన కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో అరెస్టు చేశారు. రైలు ద్వార గుజరాత్ వెళ్లి అక్కడ నుంచి కోటాకు వెళ్లారు.
ముంబై: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్(Tiger Shroff)పై జరిగిన కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై ఆ కేసు బుక్ చేశారు. తొలుత జూహూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసును ముంబై క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని జూహూ ఏరియాలో టైగర్ ష్రాఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఫైరింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ష్రాప్ ప్రాణాలతో తప్పించుకున్నారు. కానీ అతని డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. కానీ ఆ సోషల్ మీడియా స్టేట్మెంట్ను పోలీసులు నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు. భారతీయ న్యాయ సంహితలోని హత్యాయత్నం సెక్షన్ 109(1), నేర చర్యలు 3(5) సెక్షన్ కింద కేసు చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కూడా నమోదు చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న లింకులను కూడా ఆరా తీస్తున్నారు.
తాజా రిపోర్టు ప్రకారం టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. రైలు ద్వారా ప్రయాణిస్తున్న వారిని కోటా స్టేషన్లో అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు హర్యానా వ్యక్తులు కాగా, ఒకరిది మహారాష్ట్ర. అయితే ముగ్గురికీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో రిలేషన్ ఉన్నది. ట్రైనింగ్ పొందిన షూటర్లు బాలీవుడ్ హీరో హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రాథమికంగా దర్యాప్తులో తేలింది. దాడికి ముందు హీరో టైగర్ ష్రాఫ్ కదలికలను రెక్కీ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వస్తాడని తెలిసే టైగర్‌పై అటాక్‌కు ప్లాన్ చేశారని అంచనా వేస్తున్నారు.
జూహూలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ప్లాన్ ప్రకారం తప్పించుకున్నారు. ఎస్వీ రోడ్డు నుంచి విలే పార్లే, అంధేరీ మార్గంలో వెళ్లారు. అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌ను వదిలివెళ్లారు. బోరివాలీ దిశగా వెళ్లే రైలు ఎక్కారు. నిందితులు ముగ్గురు తొలుతు మహారాష్ట్ర బోర్డర్‌ను క్రాస్ చేశారని, ఆ తర్వాత పొరుగు రాష్ట్రం గుజరాత్‌లోకి ఎంటర్ అయ్యారని, అక్కడ నుంచి రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

