ధోనీసేన..ప్రాక్టీస్..ప్రాక్టీస్: ఫొటోలు వైరల్

రాబోయే ఐపీఎల్ 14వ సీజన్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ముమ్మరంగా సాధన చేస్తోంది. ట్రైనింగ్ క్యాంప్‌లో ధోనీతో పాటు అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, కర్ణ్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను చెన్నై ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. భుజానికి కిట్ బ్యాగ్ వేసుకొని చేతిలో బ్యాట్ పట్టుకొని నడుచుకుంటూ నెట్స్ ప్రాక్టీస్‌లో పాల్గొనడానికి వస్తున్న ధోనీ ఫొటో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఏప్రిల్ 9 నుంచి ఆరంభంకానున్న ఐపీఎల్ కోసం చెన్నై సన్నద్ధమవుతోంది. ట్రైనింగ్ క్యాంప్‌లో ఆటగాళ్లందరూ ఉత్సాహంగా సాధన చేస్తున్నారు. ఇటీవల ధోనీ టీమ్ కొత్త జెర్సీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో చెన్నై సీజన్‌ను ఆరంభించనుంది. స్టార్ ప్లేయర్లు సురేశ్ రైనా, జడేజా ఇంకా జట్టులో చేరాల్సి ఉంది.
Missing the Yellovely vibes of the Singara nagaram! #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/sZ6FM5mnuG
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

