ఖమ్మం : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మహిళలకు టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకృతిని, పూలని ఆరాధించే అరుదైన పండుగ మన తెలంగాణ పండుగ అని అన్నారు. బతుకమ్మ పండుగ ఆడ బిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతి రూపంగా నిలుస్తుందని చెప్పారు.