మాస్కో: షూటింగ్ కోసం ఇటీవల రోదసిలోకి వెళ్లిన రష్యాకు చెందిన సినిమా యూనిట్ ఆదివారం తిరిగి భూమి మీద సురక్షితంగా దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సినిమా షూటింగ్ కోసం రష్యాకు చెందిన ‘ది చాంలెంజ్’ సినిమా బృందం ఇటీవల వెళ్లింది. 12 రోజుల షూటింగ్ అనంతరం ఆదివారం కజఖ్స్థాన్లోని ఓ మైదాన ప్రాంతంలో ఈ బృందం సురక్షితంగా దిగినట్టు నాసా అధికారులు తెలిపారు. రోదసిలో షూటింగ్ పూర్తిచేసుకున్న తొలిచిత్రం ఇదే.