Vaccine doses: దేశంలో 48.03 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ: కేంద్రం
Vaccine doses: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌కు సరిపడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కేంద్ర సర్కారు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం 48 కోట్లకు పైగా (48,03,97,080) వ్యాక్సిన్ డోసులను ( Vaccine doses ) పంపిణీ చేసిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో వేస్టేజీతో కలిపి రాష్ట్రాలు 45,27,93,441 డోసులను వినియోగించుకున్నాయని పేర్కొన్నది.
రాష్ట్రాల దగ్గర మరో 2.73 కోట్లకు పైగా డోసులు మిగిలి ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 51 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఇదిలావుంటే దేశంలో తగ్గినట్టే తగ్గిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. ఒక దశలో 30 వేల దిగువకు చేరిన రోజువారీ కేసులు ఇప్పుడు మళ్లీ 45 వేల దగ్గరకు చేరాయి. ఇవాళ కూడా దేశంలో 44,230 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

