కోల్కతా, డిసెంబర్ 12: పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఫేజ్-1 ప్లేస్మెంట్ సీజన్లో భాగంగా విద్యార్థులు 1,600కు పైగా ఉద్యోగ ఆఫర్లు సాధించారు. ఇది దేశంలోని ఐఐటీల చరిత్రలోనే రికార్డు అని ఖరగ్పూర్ ఐఐటీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఒక విద్యార్థి ఏడాదికి రూ.2.4 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించగా, మరో 22 మంది రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్ల ప్యాకేజీతో ఎంపికయ్యారని వెల్లడించింది. మొత్తం 245కి పైగా కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నాయి. పది రోజుల పాటు సాగిన ఫేజ్ 1 ప్లేస్మెంట్ ప్రక్రియ ఈనెల 11తో ముగిసిందని, వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఫేజ్-2 ఉండే అవకాశం ఉన్నదని తెలిపింది.