కీలక పురోగతి: కరోనా వైరస్ నిర్మాణంపై స్పష్టత

బెంగళూరు: కరోనా వైరస్ నిర్మాణంపై పూర్తి స్పష్టత వచ్చింది. కొవిడ్-19 వ్యాప్తికి కారణమవుతున్న సార్స్ సీఓవీ-2 నిర్మాణాన్ని తెలుసుకోవడంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు (ఐఐఎస్సీ) చెందిన మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ పరిశోధకులు కీలక పురోగతి సాధించారు. మానవ శరీరంలో కరోనా ప్రవేశించినప్పుడు స్పైక్ ప్రోటీన్ (S ప్రోటీన్) స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తేల్చారు.
శారీరక పీహెచ్ 7.4 వద్ద ఎస్-ప్రొటీన్లలో 68శాతం ఓపెన్ ఫార్మేషన్లో ఉంటాయని పరిశోధన బృందం కనుగొన్నది. అయితే, పీహెచ్ 8.0 లేదా పీహెచ్ 6.5 వద్ద ఉన్నప్పుడు వాటి నిష్పత్తి తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం ఫలితాలు ఎస్-ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకునే మెరుగైన కరోనా టీకా తయారీకి ఉపయోగపడతాయని పరిశోధకులు వెల్లడించారు. “ఇప్పటివరకూ శారీరక పీహెచ్ 8.0, పీహెచ్ 4.0, పీహెచ్ 5.0 వద్ద స్పైక్ ప్రొటీన్ (ఎస్-ప్రొటీన్) నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. మేము సింగిల్-పార్టికల్ క్రియో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనే సాంకేతికతను ఉపయోగించి ఫిజియోలాజికల్ పీహెచ్ 7.4, పీహెచ్ 6.5, పీహెచ్ 8.0 వద్ద ఎస్-ప్రోటీన్ విభిన్న నిర్మాణాలను గుర్తించాం.” అని అధ్యయానికి నేతృత్వం వహించిన సైంటిస్ట్ సోమనాథ్ దత్త వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

