ఎకో టూరిజం అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో ఏకో – టూరిజం అభివృద్ధిపై పర్యాటక – అటవీశాఖ ఉన్నతస్థాయి అధికారులతో పర్యాటకశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ పరిధిలోని టూరిజం ప్రాంతాల్లో పర్యాటకుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులు అటవీ, పర్యాటక శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎకో టూరిజం అభివృద్ధి పై చర్చించారు.
కవ్వాల్ జంగిల్ సఫారీ, లక్నవరం, పాకాల చెరువులు, బోగత జలపాతం, మల్లూర్ ట్రెక్కింగ్ పాత్ వే లు, ఫర్హాబాద్ ఎకో సర్యూట్ పార్కుల అభివృద్దిపై ప్రత్యేకంగా చర్చించారు. రిజర్వాయర్లలో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం మరిన్ని బోట్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ జోన్లు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, శాంక్చూరీలు ఉన్న చోట అటవీశాఖ అనుమతులు తీసుకుని అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. కడెం రిజర్వాయర్‌లో కొత్త బోట్లను ఏర్పాటు చేయాలని ఎమ్యెల్యే రేఖా శ్యాంనాయక్ కోరగా తగిన ఏర్పాట్లు చేయాలని పర్యాటకశాఖ అధికారులకు మంత్రులు సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపురావు , దివాకర్ రావు, ఆత్రం సక్కు, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు , అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, పర్యాటక శాఖ కార్యదర్శి కేఎస్. శ్రీనివాస రాజు, పీసీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్రీ ఆర్.యం. డోబ్రియల్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

