రాష్ర్టంలో 15 ఎకో టూరిజం పార్కులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎకో టూరిజంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. సోమశిల రిజర్వాయర్, సింగోటం రిజర్వాయర్, అక్కమహాదేవి గుహాలు, ఈగలపెంట, మన్ననూరు, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, పాకాల, ఆలీసాగర్ వద్ద ఎకో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మహబూబ్‌నగర్ సమీపంలో 2,097 ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.
గతంలో టూరిజం స్పాట్లను వ్యాపార కేంద్రాలుగా మార్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. టూరిజం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది. టూరిజం పేరుతో ఉమ్మడి ఏపీలో విలువైన భూములు కబ్జా చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అచ్చంపేట, సోమశిలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటును అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజర్వాయర్లు నిర్మించిన ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం బోట్లు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఉమామహేశ్వరం ఆలయం వద్ద పార్కుతో పాటు ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నల్లమలలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పాకాల చెరువు వద్ద ఇప్పటికే కొంత అభివృద్ధి చేశాం.. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శించి మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్‌సాగర్, సరళాసాగర్, మిడ్‌మానేరుతో పాటు మిగతా రిజర్వాయర్ల వద్ద ఎకో టూరిజం పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణను టూరిజం హబ్‌గా తయారు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

