ఆత్మగౌరవ సూచికగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నం : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆత్మగౌరవ సూచికగా తెలంగాణ అమరుల స్మారక చిహ్నం : మంత్రి | తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్మారక చిహ్నం

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవ సూచికగా హుస్సేన్ సాగర్ తీరంలో అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్మారక చిహ్నం నిర్మాణ పనులను సోమవారం రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియదిరిగి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని నిత్యం స్మరించుకునేలా నిర్మిస్తున్న స్మారక చిహ్నం గొప్ప కట్టడంగా నిలువనుందన్నారు.

అమరుల త్యాగాన్ని చాటిచెప్పేలా నిర్మాణం ఉంటుందన్నారు. అనంతరం నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు. బ్లాక్ వైస్ పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీ, ఆర్అండ్బీ అధికారులను సూచించారు. మంత్రి వెంట ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈ శశిధర్, పలువురు అధికారులు, వాస్తు నిపుణులు తేజ, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

