Minister Gangula | అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించాలి : మంత్రి గంగుల
Minister Gangula | ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ తర్వాత కనిపించకుండా పోతారని..కనిపించకుండా పోయే నాయకులు కావాలా? నిత్యం ప్రజల్లో ఉండి అభివృద్ధి చేసే నాయకులు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రిమ బుధవారం శంకుస్థాపన చేశారు.
కరీంనగర్ : ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ తర్వాత కనిపించకుండా పోతారని..కనిపించకుండా పోయే నాయకులు కావాలా? నిత్యం ప్రజల్లో ఉండి అభివృద్ధి చేసే నాయకులు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రిమ బుధవారం శంకుస్థాపన చేశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుతో పాటు, బస్తీ దవఖానను ప్రారంభించారు. అనంతరం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆరేపల్లి గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు వరుసగా రెండోసారి గెలిచిన చరిత్ర లేదని, నాకు హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన మీకు ఎప్పుడు రుణపడి ఉంటాన్నారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలకోట్ల నిధులను విడుదల చేశారన్నారు. పచ్చని తెలంగాణను చూస్తే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కడుపు మండుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు.కాంగ్రెస్, బీజేపీలకు అధికారం కట్టబెడితే ఇక్కడి బొగ్గు, నీరు, కరెంటు, హైదరాబాద్ సంపదను దోచుకుంటారని, మళ్లీ ఆ తప్పు జరగొద్దన్నారు. స్వరాష్ట్రంలో మత ఘర్షణలు తలెత్తకుండా శాంతి భద్రతలు భేషుగ్గా ఉన్నాయని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరోసారి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

