హైదరాబాద్ : ప్రముఖ విద్యావేత్త, జనగామ జిల్లా పాలకుర్తిలోని గూడురుకు చెందిన చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జనగామ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన చుక్కా రామయ్య నాడు హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని గర్తు చేశారు.
నిజాం నవాబ్, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారన్నారు. జనగామలో ఉపాధ్యాయుడిగా చేరి, అనేక చోట్ల పని చేసిన ఆయన, నాగార్జునసాగర్ ఆవాస పాఠశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ చేశారన్నారు. అనంతరం ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం కోసం హైదరాబాద్‌కు వచ్చి నల్లకుంటలో ఆ కేంద్రాన్ని నడుపుతూ ఐఐటీ రామయ్యగా పేరు గడించారంటూ కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో దేశంలో, రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితులు, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.