వరల్డ్ ఫుల్ మారథాన్‌కు ఎంపికైన మోహన్‌రెడ్డిని అభినందించిన మంత్రి
వరల్డ్ ఫుల్ మారథాన్‌కు ఎంపికైన మోహన్‌రెడ్డిని అభినందించిన మంత్రి | అమెరికా చికాగో నగరంలో అక్టోబర్ 10న జరిగే వరల్డ్ ఫుల్ మారథాన్ (42.2 కిలోమీటర్లు)కు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన జగన్మోహన్రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి

హైదరాబాద్ : అమెరికా చికాగో నగరంలో అక్టోబర్ 10న జరిగే వరల్డ్ ఫుల్ మారథాన్ (42.2 కిలోమీటర్లు)కు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన జగన్మోహన్రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అభినందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుల్ మారథాన్‌లో పాల్గొనే అవకాశం రావడం తెలంగాణకే గర్వకారణమన్నారు. మారథాన్‌లో 200 దేశాల నుంచి సుమారు 30వేల మంది అథ్లెట్లు పాల్గొంటారన్నారు.
ఈవెంట్లో పాల్గొనేందుకు ముందస్తుగా ఢిల్లీలో నిర్వహించిన ఫుల్ మారథాన్‌లో క్వాలిఫై కావడంతో అమెరికాలో జరిగే మారథాన్‌కు ఎంపికయ్యారన్నారు. మారథాన్‌ను 2.55గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్రెడ్డి ఫుల్ మారథాన్‌లో మంచి ప్రతిభ కనబరిచి తెలంగాణకు పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాష్ట్ర క్రీడాశాఖ తరఫున అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, వెటరన్ క్రీడాకారులు, ఎంఎల్ఆర్ విద్యాసంస్థ చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

