సీఎం అభ్యర్థిగా.. శ్రీధరన్!

- కేరళ బీజేపీ యూనిట్ నిర్ణయం
- పార్టీ జాతీయ నాయకత్వానికి ప్రతిపాదన
- సాధారణ పొలిటీషియన్‌లా ఉండనన్న శ్రీధరన్
- తన ప్రచార శైలి వేరుగా ఉంటుందని వెల్లడి
తిరువల్ల, మార్చి 4: కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్ ఎంపిక చేసింది. శ్రీధరన్‌ను కేరళ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ జాతీయ నాయకత్వాన్ని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ కోరారు. ‘శ్రీధరన్ నేతృత్వంలో కేరళలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ సహకారంతో10 రెట్లు వేగంగా అభివృద్ధి పనులను చేపడతాం’ అని పేర్కొన్నారు. సురేంద్రన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత కేంద్రమంత్రి వీ మురళీధరన్ స్పందించారు. శ్రీధరన్ నేతృత్వంలోనే బీజేపీ ఏప్రిల్ 6న జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని, ఆయనే సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీపీఎం, కాంగ్రెస్‌లను ఓడిస్తామని, అవినీతిరహితంగా, అభివృద్ధి మార్గంలో పాలనను అందిస్తామని ట్వీట్ చేశారు. శ్రీధరన్ వయస్సు 88 ఏండ్లు. సాధారణంగా వయోవృద్ధ నేతలను పక్కన పెట్టే బీజేపీ.. శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం గమనార్హం.
రాజకీయాల్లోనూ టెక్నోక్రాట్గానే ఉంటా..
ప్రస్తుతం ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) సలహాదారుగా ఉన్న శ్రీధరన్ గురువారం పలారీవట్టోమ్ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. అనంతరం ప్రారంభ కార్యక్రమం కోసం కేరళ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను తొలిసారి 1997 నవంబర్‌లో డీఎంఆర్సీ యూనిఫాం వేసుకొన్నాను. 24 ఏండ్లుగా వేసుకొంటూనే ఉన్నాను. ఇక ఈ యూనిఫాం ధరించడం ఇదే ఆఖరు రోజు’ అని అన్నారు. రాజకీయాల్లోనూ టెక్నోక్రాట్ శైలిలోనే వ్యవహరిస్తానని, సాధారణ రాజకీయ నాయకుడిలా ఉండనని చెప్పారు. ‘ఇది డిజిటల్ యుగం. నేను ఇంటింటికి తిరిగి ఓట్లు అడగను. కానీ నా సందేశం ప్రతీ ఇంటికి చేరుతుంది’ అని అన్నారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

