శర్వానంద్ నాకు బిడ్డలాంటి వాడు: చిరంజీవి

యువ హీరో శర్వానంద్, గ్లామర్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రధాన పాత్రలలో కిషోర్ తెరకెక్కించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజానీకం తనపై చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఖమ్మం ప్రజలను మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. . ఈ ఈవెంట్‌కు రావడానికి నిర్మాతలు ముఖ్య కారణం అయితే.. శర్వానంద్ కూడా ఓ కారణం అని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్.. నాకు కాల్ చేసి శ్రీకారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళతారా అంటే నేను ఖమ్మంలో ఉన్నాను కదా, అని అన్నాను. దానికి వాడు అందరు అక్కడికి వస్తారు అని అనడంతో చాలా సంతోషంగా అనిపించింది.
శర్వానంద్ చిన్నప్పటి నుంచీ మా ఇంట్లోనే రామ్ చరణ్‌తో కలిసి పెరిగాడు. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్ చరణ్. శర్వానంద్ నేను కలిసి థమ్సప్ యాడ్‌లో చేశాం. అలానే శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించి అలరించాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శర్వానంద్ చేసిన ఆ సీన్ అతని నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చని చిరంజీవి అన్నారు. ఆనాడే శర్వా నటనకు శ్రీకారం పడిందని.. నటనకు తిలకం దిద్దింది కూడా తానేనని చిరంజీవి గర్వంగా చెప్పారు. శ్రీకారం లాంటి మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వాను అందరు ఆశీర్వదించండి అని చిరంజీవి కోరారు .
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

