పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పారిస్ మాస్టర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జొకోవిచ్ 3-6, 6-0, 7-6 (7/5)తో హబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా రికార్డు స్థాయిలో ఏడోసారి నంబర్‌వన్ ర్యాంక్‌తో సీజన్‌ను ముగించేందుకు సిద్ధమయ్యాడు.