లండన్: రష్యా యువ టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ .. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అధికారింగా అగ్రస్థానానికి చేరాడు. కరోనా వ్యాక్సిన్ వివాదంతో సెర్బియా వీరుడు నోవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమవడంతో.. మెద్వెదెవ్కు ఈ చాన్స్ దక్కింది. గత పద్దెనిమిదేండ్లలో ‘బిగ్ ఫోర్’ (ఫెదరర్, నాదల్, జొకోవిచ్, ముర్రే) కాకుండా నంబర్‌వన్ స్థానం దక్కించుకున్న తొలి ఆటగాడిగా మెద్వెదెవ్ నిలిచాడు. 2004 ఫిబ్రవరిలో ఆండీ రాడిక్ అగ్రస్థానం దక్కించుకున్న తర్వాత ఈ నలుగురు మాత్రమే టాప్కు చేరారు. ఓవరాల్‌గా రికార్డు స్థాయిలో 361 వారాల పాటు నంబర్‌వన్ స్థానంలో కొనసాగిన జొకో ప్రస్తుతం రెండో ర్యాంక్‌కు పడిపోగా.. జ్వెరెవ్, నాదల్, సిట్సిపాస్ టాప్-5లో కొనసాగుతున్నారు.