22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే ఆ వరద..

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని దౌలీగంగా నదిలో వచ్చిన ఉప్పెనకు సంబంధించిన నివేదికను రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటేన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) శాస్త్రవేత్తలు ఆ ఘటన పట్ల రిపోర్ట్ ఇచ్చారు. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడడం వల్ల దౌలీగంగా, రిషి గంగా, అలకనంద నదుల్లో ఆకస్మిక వరద వచ్చినట్లు ఆ నివేదికలో తెలిపారు. ఆ వరదల్లో సుమారు 70 మంది మృతిచెందారు. మరో 125 మంది ఆచూకీ లేకుండాపోయారు. రోంటీ పర్వతశ్రేణి వద్ద ఉన్న భారీ రాళ్లు, కొండచరియలు విరిగిపడడం వల్ల .. ఆ ధాటికి అక్కడ ఉన్న మంచు కరిగిపోయిందని, దాని వల్లే భీకర రీతిలో వరదలు వచ్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మంచుగడ్డతో మిక్స్ అయిన ఉన్న సుమారు 22 మిలియన్ల క్యూబిక్ మీటర్ల రాళ్లు పడిపోవడంతో పాటు.. అప్పటికే ఆ లోయలో పేరుకుపోయిన మంచు వల్ల.. భారీ ఉప్పెన వచ్చినట్లు స్టడీ పేర్కొన్నది. అకస్మాత్తుగా కురిసిన కొండచరియలతో నీరు ఉప్పొంగిందని, దాంతో ఉదృతమైన వరద వచ్చినట్లు ఐసీఐఎంఓడీ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న గ్రామాలతో కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యామ్నాయంగా రిషిగంగా నదిపై బెయిలీ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఆ బ్రిడ్జ్‌పై పనులు ప్రారంభం అయ్యాయి. నిజానికి మార్చి 20వ తేదీ ఆ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఓవర్‌టైమ్ పనిచేయడంతో బ్రిడ్జ్ త్వరగా పూర్తి అయ్యింది. శుక్రవారం ఆ బ్రిడ్జ్‌ను ఓపెన్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

