ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కలిండి కుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలోని మురికి వాడలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఆరు ఫైర్ టెండర్లను తరలించింది. మంటలు, దట్టమైన పొగ కారణంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందికి ఎదురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మురికివాడలో అందరూ నిద్రిస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. రోహింగ్యా ముస్లిం శరణార్థుల శిబిరాలు మురికివాడలో ఉన్నాయి. అయితే, మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. శనివారం ఉదయం సైతం లాజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్లోని షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరగ్గా భారీగా ఆస్తినష్టం జరిగింది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

