న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు పోస్ట్ చేసే వీడియోలు చిరాకు తెప్పిస్తుంటాయి. మ్యాగీ షేక్ నుంచి రస్గుల్లా చాట్ వరకూ వింతైన కాంబినేషన్స్‌తో కూడిన ఫుడ్ వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేయగా తాజాగా ఓ వైరల్ వీడియోలో గులాబ్ జామూన్‌తో ఓ వ్యక్తి బర్గర్ చేస్తుండటం కనిపించింది.
Presenting Gulab Jaman Burger! pic.twitter.com/6mU5a0YQZN
— T (@Tabeshq) September 19, 2022
ఇక సోషల్ మీడియాలో కొన్ని డిష్‌లు నెటిజన్ల మనసు దోచుకుంటుండగా మరికొన్ని డిష్‌ల పట్ల పెదవివిరుస్తుంటారు. లేటెస్ట్ వీడియోలో గులాబ్ జామూన్ బర్గర్ పట్ల నెటిజన్లు ఏమంత ఆసక్తి కనబరచలేదు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 20,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి బర్గర్ బన్‌లలో గులాబ్ జామూన్‌ను స్టఫ్ చేసి ఆపై వాటిని పాన్‌పై ఫ్రై చేశాడు. సింపుల్ స్నాక్‌గా ముందుకొచ్చిన ఈ డిష్‌పై నెటిజన్లలో మిక్స్డ్ రియాక్షన్ వెల్లడైంది.