కార్లు అద్దెకు తీసుకుని అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : కార్లు, బైక్‌లు అద్దెకు తీసుకుని వాటిని అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని మాదాపూర్ పోలీసులతో కలిసి శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం ఆటోమొబైల్ దొంగను శుక్రవారం అరెస్టు చేసింది. నిందితుడిని జి.మహేశ్ నూతన్ కుమార్(27)గా గుర్తించారు. మొబైల్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ నివాసి. స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి. మహేశ్ 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడ్డాడు. ఇతడి వద్ద నుండి పోలీసులు రూ. 70 లక్షల విలువ గల ఆరు కార్లు, ఓ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సైబరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ అయిన మహేశ్ ఎంపిక చేసుకున్న నగరాల్లో మెన్స్ హాస్టల్స్‌లో దిగుతాడు. అక్కడ తను రూం షేర్ చేసుకున్నవారికి నమ్మకం వచ్చేంత వరకు ఓపికగా ఉండి ఆపై వారి నగదు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడీ ఫ్రూప్స్‌తో పరారయ్యేవాడు. అనంతరం వాటిని ఉపయోగించి వివిధ కంపెనీల్లో కార్లు అద్దెకు తీసుకునేవాడు.
జీపీఎస్ డివైజ్, ఒరిజినల్ నంబరు ప్లేట్‌ను తీసేసి వాటిని తక్కువ ధరకు అమ్మేవాడు. రెంటల్ కార్ ఏజెన్సీ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ క్లూస్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

