Indian Students | అమెరికాలో మనోళ్లే టాప్.. అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే
ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది.
- 2023-24లో 3.31 లక్షల మంది విద్యార్థుల విద్యాభ్యాసం
- ఓపెన్ డోర్స్-2024 నివేదిక
Indian Students | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఉన్నత చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను పంపిన దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది. 3.31 లక్షల మంది విద్యార్థులతో భారత్ మొదటిస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానానికి పరిమితమైందని ‘ఓపెన్ డోర్స్’ నివేదిక పేర్కొన్నది. 2023-24లో అమెరికా 11.26 లక్షల స్టూడెంట్ వీసాలు జారీచేసింది.
నివేదిక ప్రకారం, 2022-23లో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2,68,923 కాగా, 2023-24నాటికి 23 శాతం పెరిగి 3,31,602కు చేరుకుంది. ఇందులో మాస్టర్స్, పీహెచ్డీ చేస్తున్న వారు 1,96 లక్షల మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వీరి సంఖ్య 1.65 లక్షలుగా ఉండేది. అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ మొదటిస్థానంలో నిలబడటం 15 ఏండ్లలో ఇదే తొలిసారి. భారత్‌లో చదువుతున్న అమెరికా విద్యార్థుల సంఖ్య కూడా పెరిగినట్టు నివేదిక తెలిపింది. 2021-22లో 331 మంది అమెరికన్ విద్యార్థులు మన దగ్గర చదవగా, 2022-23లో వీరి సంఖ్య 1,355కు పెరిగింది.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

