Mahua Moitra | బద్లాపూర్ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం : టీఎంసీ ఎంపీ
Mahua Moitra : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
Mahua Moitra : మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ స్కూల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మహారాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడిని కొద్దిగంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ బద్లాపూర్ ఘటనలో రోజులు గడిచినా ఇంతవరకూ కేసు నమోదు చేయలేదని ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.
బద్లాపూర్ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు నిరాకరించారని, ఆర్జీ కార్ ఘటనలో నిందితుడిని కోల్‌కతా పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారని ఆమె వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అసలైన ప్రజాస్వామ్యేతర కూటమి అని మహువ మొయిత్ర మండిపడ్డారు. కాగా, బద్లాపూర్ స్కూల్ వాష్‌రూంలో ఇద్దరు మూడేండ్ల, నాలుగేండ్ల చిన్నారులపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపింది.
ఈ ఘటనపై ఆగ్రహంతో బాలికల తల్లితండ్రులు, స్ధానికులు స్కూల్‌పై దాడికి తెగబడ్డారు. స్ధానిక రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లను నిలిపివేశారు. రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ కేసుపై విచారణ చేసేందుకు బద్లాపూర్‌కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) బృందాన్ని పంపింది.
Read More :
Mayawati | దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: మాయావతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

