నల్ల ద్రాక్షతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల ద్రాక్ష రుచిలో తీపిగా ఉంటుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల ద్రాక్ష రుచిలో తీపిగా ఉంటుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్లటి ద్రాక్షలో సీ-విటమిన్, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.
నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.
ద్రాక్షలో ప్లేవనాయిడ్స్‌లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. నిత్యయవ్వనులుగా ఉంచుతాయి. నల్లటి ద్రాక్షలు రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి. గుండెపోటు నివారణకు దోహదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకొనే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను దూరంచేస్తాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది

నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడటం ఆపడం ద్వారా ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.
జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది

నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా, నల్ల ద్రాక్ష తినడం ద్వారా మానసిక కార్యకలాపాలను నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.
డయాబెటిస్‌కు ప్రయోజనకరమైనది

మధుమేహాన్ని నయం చేయడంలో కూడా నల్ల ద్రాక్షలు సహాయపడుతాయి. నల్ల ద్రాక్షలో రెస్వెరాటల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచడం ద్వారా శరీరంలోని చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
జుట్టుకు ఆరోగ్యకరమైనది

జుట్టుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఎక్కువగా నల్ల ద్రాక్ష పండ్లను తినాలి. వీటిలో లభించే విటమిన్ ఈ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నల్ల ద్రాక్షలో ఉండే విటమిన్ ఈ.. చుండ్రు, జుట్టు రాలడం లేదా తెల్లగా మారడం వంటి జుట్టు సమస్యలను నయం చేస్తుంది. వీటిని తినడం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. జుట్టు మందంగా, మృదువుగా, బలంగా మారుతుంది.
ఇవి కూడా చదవండి..
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్
బెంగాల్ ఎన్నికలకు యూపీ పోలీసులు.. ఈసీకి టీఎంసీ లేఖ
బిట్ కాయిన్‌తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Black Grapes
- Diabetes
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

