Eklavya | సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఏఐ నటుడితో లయన్స్‌గేట్ ప్లే ‘ఏకలవ్య’ వెబ్ సిరీస్!
YUGRai | సాంకేతిక విప్లవంలో భాగంగా కృత్రిమ మేధ (AI) సినీ పరిశ్రమ రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. ఇప్పటివరకు షూటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి సాంకేతిక విభాగాలకే పరిమితమైన ఏఐ వినియోగం, ఇప్పుడు ఏకంగా నటన రంగంలోకి అడుగుపెడుతూ సరికొత్త సంచలనానికి తెరతీసింది.
సాంకేతిక విప్లవంలో భాగంగా కృత్రిమ మేధ (AI) సినీ పరిశ్రమ రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. ఇప్పటివరకు షూటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి సాంకేతిక విభాగాలకే పరిమితమైన ఏఐ వినియోగం, ఇప్పుడు ఏకంగా నటన రంగంలోకి అడుగుపెడుతూ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ప్రముఖ ఓటీటీ వేదిక లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఒక కృత్రిమ మేధ నటుడిని ప్రధాన పాత్రలో పెట్టి వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసిందిజ
మహాభారత ఇతిహాసంలోని అత్యంత శక్తివంతమైన ఏకలవ్యుడి పాత్ర ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ‘ఏకలవ్య’ (Eklavya) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో టైటిల్ రోల్‌ను పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టించారు. ఈ వర్చువల్ నటుడికి ‘యుగ్ ఆర్.ఏఐ’ (YUG R.Ai) అని నామకరణం చేయగా, తాజాగా ఆ పాత్ర రూపురేఖలను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక ప్రోమో వీడియోను విడుదల చేశారు. విలక్షణ దర్శకుడు విభు పురి ఈ ప్రతిష్ఠాత్మక వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధం కానుంది.
కొన్ని గాథలు కాలంతో మరుగుపడవు… చరిత్రలో వాటికి దక్కాల్సిన స్థానం మాత్రమే దక్కలేదు. 🏹
సమర్పిస్తున్నది ఏకలవ్య – చరిత్ర మరచిపోయిన గొప్ప విద్యార్థి.
ఏకలవ్యుడిగా Yug https://t.co/ggNhfAkxEl పరిచయం.#Eklavya #ComingSoon https://t.co/M5d1OlVPXx
— Lionsgate Play (@lionsgateplayIN) November 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eklavya | సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఏఐ నటుడితో లయన్స్‌గేట్ ప్లే ‘ఏకలవ్య’ వెబ్ సిరీస్!
North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా..11 ఏండ్ల ప్రయాణానికి ముగింపు
‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
‘పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

