మార్చొద్దు : యెడ్డికి మద్దతుగా లింగాయత్ పీఠాధిపతులు
కర్ణాటకలో శక్తివంతమైన లింగాయత్ మఠాధిపతులు ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు మద్దతుగా నిలిచారు. ఆయన పూర్తికాలం ముఖ్యమంత్రి పీఠంపై ఉండేలా చూడాలని, ఆయన ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని వారు రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించారు

తుమ్కూరు: కర్ణాటకలో శక్తివంతమైన లింగాయత్ మఠాధిపతులు ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు మద్దతుగా నిలిచారు. ఆయన పూర్తికాలం ముఖ్యమంత్రి పీఠంపై ఉండేలా చూడాలని, ఆయన ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని వారు రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించారు. అందిన సమాచారం మేరకు, రానున్న రెండేండ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యెడ్డీనే కొనసాగించాలని దాదాపు డజను మంది లింగాయత్ పీఠాధిపతులు బీజేపీ నాయకత్వానికి విజ్క్షప్తి చేశారు. యెడియూరప్ప కర్ణాటకలో శక్తివంతమైన లింగాయత్ సమాజానికి చెందినవాడు. ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఆయనను వేధించవద్దని ఈ పీఠాధిపతులు హెచ్చరించారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ప్రకటన చేసిన లింగాయత్ పీఠాధిపతుల నుంచి ఈ ప్రకటన వెలువడింది. అరుణ్ సింగ్ వ్యాఖ్యలను అనుసరించి యెడియూరప్ప కూడా రానున్న రెండేండ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని నొక్కి చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనపై చూపిన నమ్మకం వల్ల తన బాధ్యత మరింత పెరిగిందని 78 ఏండ్ల లింగాయత్ నాయకుడైన యెడియూరప్ప అన్నారు. తుమ్కూరులోని శ్రీషాదక్షర బ్రుహన్మథ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 12 మంది లింగాయత్ పీఠాధిపతులు హాజరై తమ సామాజిక వర్గానికి చెందిన యెడియూరప్పకు మద్దతుగా నిలిచారు.
కర్ణాటకలో బీజేపీ పట్టు సాధించడానికి యెడియూరప్ప ప్రధాన కారణమని పీఠాధిపతులు చెప్పారు. అయితే, తరచుగా వేధింపులకు గురవుతుండటం సహించరానిదన్నారు. ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడం మానేసి అతడితో సహకరించడం ప్రారంభిస్తే మరింత ముందుకెళ్లవచ్చు అని వారు సూచించారు. యెడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించేందుకు ఆయన వయసు గురించి పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారని, తమిళనాడులో కరుణానిధి ఎలా పాలించారో గుర్తెరగాలని వారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారు ఆయన కర్ణాటకలో 100 సీట్ల మార్కు సాధించేందుకు అహోరాత్రాలు ఎలా కష్టించారో ఒకసారి గుర్తుచేసుకుంటే బాగుంటుదని వారు హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
అమెజాన్ అండ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
క్లాట్ 2021 : పరీక్ష తేదీని ప్రకటించిన కన్సార్టియం
ఏనుగుల దాడి : జైలులో గ్రామస్థుల బస
కొత్త అలారం : 15 నిమిషాల్లో కరోనా గుర్తింపు..!
గైర్హాజరు ఎందుకో : బెంగాల్ బీజేపీలో ముదురుతున్న సంక్షోభం
చరిత్రలో ఈరోజు : గల్వాన్ వీరులకు వందనం
గోర్లను చూసి డయాబెటిస్ ఉందా లేదా గుర్తించొచ్చు.. అదెలానో మీరూ తెలుసుకోండి.!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

