Lenin | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఒక పెద్ద కమర్షియల్ విజయానికి ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా కొత్త ఊపునిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడుదలైన తొలి షో నుంచే ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మంచి ఆరంభాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో పాటు, విడుదలకు ముందే జరిగిన నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.
థియేటర్లలో విడుదలకు ముందే డబ్బింగ్, శాటిలైట్, ఆడియో, ఓటీటీ హక్కుల ద్వారా ‘లెనిన్’కు సుమారు రూ.34 కోట్ల బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే నిర్మాతలు బడ్జెట్లో గణనీయమైన మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ డిజిటల్ హక్కుల కోసం పలువురు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడినట్లు సమాచారం. చివరకు జీ నెట్వర్క్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అనంతరం జీ తెలుగు ఛానల్లో టెలివిజన్ ప్రీమియర్ ప్రసారం చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పెద్ద సినిమాలు థియేటర్లలో కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల ప్రదర్శన పూర్తయ్యాకే ఓటీటీలోకి వస్తున్నాయి. ‘లెనిన్’ కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశముంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమా థియేట్రికల్ రన్ ఆశించిన విధంగా కొనసాగితే ఓటీటీ విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సాధారణ ప్రణాళిక ప్రకారమే సాగితే ఆగస్టు రెండో వారంలో, ముఖ్యంగా ఆగస్టు 14 ప్రాంతంలో జీ5లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేటర్లలో సినిమా ఎక్కువకాలం విజయవంతంగా ప్రదర్శితమైతే, ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారానికి ఓటీటీ విడుదల వాయిదా పడే అవకాశమూ ఉంది. డిజిటల్ విడుదల సమయంలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ‘లెనిన్’ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.