ముంబై: మిస్టర్ కూల్ ధోనీ మరోసారి ఫినిషింట్ టచ్‌తో కేక పుట్టించాడు. ఐపీఎల్లో గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్ ఫైనల్ ఓవర్లో థ్రిల్లింగ్ ఇన్నింగ్స్‌తో ధోనీ ఆకట్టుకున్నాడు. ధోనీ ఫటాఫటా షాట్లకు ముంబై జట్టుకు వరుసగా ఏడో ఓటమి తప్పలేదు. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో.. ఉనాద్కట్ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్ ఔట్ కాగా.. రెండో బంతికి బ్రేవో సింగిల్ తీసి ధోనీకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 16 పరుగులకు చేరగా.. ఆ దశలో ధోనీ తన స్టయిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్ లెగ్ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు. ఆ వీడియో ఇదే.
" The Finisher MS Dhoni!!! 🔥 "#Dhoni • #MSDhoni𓃵 pic.twitter.com/Tus7TwHeWt
— MSD (@DevoteeOfDhoni) April 21, 2022