మంగళూరు సోయగం కృతిశెట్టి ప్రస్తుతం తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్నది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ భామకు భారీ చిత్రాల్లో అవకాశాలు వరిస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల విషయంలో తాను పాటించే కొన్ని నియమాల గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించిందీ అమ్మడు. ముఖ్యంగా ఐటెంసాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే విషయంలో కొన్ని పరిమితుల్ని విధించుకున్నానని పేర్కొంది.
ఆమె మాట్లాడుతూ ‘నేను ఐటెంసాంగ్స్కు దూరంగా ఉంటాను. ఎందుకంటే ఆ తరహా గీతాల్లో ప్రేక్షకులు నన్ను ఇష్టపడరని అనిపిస్తుంది. కొన్ని చిత్రాల్లో రొమాంటిక్ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఇష్టం లేని పని చేయకపోవడమే మంచిదని తెలుసుకున్నా. భవిష్యత్తులో కూడా ఇవే నియమాల్ని ఫాలో అవుతాను’ అని చెప్పింది. కృతిశెట్టి నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.