భక్తి… జ్ఞానం..మోక్షం…కర్తవ్యం… మానవ జీవన గమనానికి మార్గదర్శకుడు … పరమపురుషుడు.. ప్రేమమూర్తి… గీతోపదేశ పరమాత్ముడైన ఆ శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం…
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం హరేహరే కృష్ణ…కృష్ణం వందే జగద్గురుమ్… స్మరణతో ఆలయాలు, వాడవాడలు మారుమ్రోగాయి.
దేవాలయాలలో భక్తులు ప్రత్యేక అర్చనలు చేశారు. చిన్నారులు గోపికలు,చిన్నికృష్ణుని వేషాధారణలతో అలరింపజేశారు.
వివిధ ప్రాంతాల్లోని శ్రీకృష్ణమందిరాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న తదితర పదార్ధాలతో అభిషేక, అర్చన కార్యక్రమాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గోన్నారు.
తల్లిదండ్రులు తమ చిన్నారులను శ్రీకృష్ణుని వేషధారణగావించి వారుచేస్తున్న చిలిపిచేష్టలను చూసుకొని మురిసిపోయారు.