రేపటి కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా
కృష్ణా నది యాజమాన్య బోర్డు | ఈ నెల 9న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో భేటీ కీలకంగా

హైదరాబాద్ : ఈ నెల 9న జరుగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. కాగా, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాలను పునః సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు ఇటీవల లేఖరాసింది.
కృష్ణా నీటి వినియోగంపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చించేందుకంటూ ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ఈ నెల 20 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు. ఏపీ లేవనెత్తిన అంశాలను మాత్రమే సమావేశాల ఎజెండాలో చేర్చారని, తెలంగాణ అభ్యంతరాలను విస్మరించారని ఆక్షేపించారు. 2019 ఫిబ్రవరి 14న, ఈ నెల 2న తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన లేఖల్లోని అంశాలను సమావేశాల ఎజెండాలో చేర్చలేదని పేర్కొన్నారు.
వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో తమ సాగునీటిశాఖ అధికారులు, సాంకేతిక బృందం ఆ పనుల్లో తీరికలేకుండా ఉన్నారని, అందువల్ల పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని 20వ తేదీ తర్వాత రెండు రాష్ర్టాలకు అనుకూలమైన తేదీన నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తిచేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని కేఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలోని కీలకాంశాలు
- కృష్ణా జలాల వాటాల నిష్పత్తిపై ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి పునః సమీక్షించాలి.
- ఏపీ అక్రమంగా చేపట్టిన రాయలసీమ లిఫ్ట్, రాజోలిబండ డైవర్షన్ స్కీం కుడి కాలువ పనులను వెంటనే నిలిపేయాలి.
- పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను ఏపీ.. అక్రమంగా బేసిన్ అవతలి ప్రాంతాలకు మళ్లిస్తున్నది. ఆ మళ్లింపును అడ్డుకోవాలి.
- పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదం తెలిపినందున బచావత్ ట్రిబ్యునల్ అవార్డును అనుసరించి తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలి.
- తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 80 శాతం తిరిగి నదిలోకే వస్తాయని, అందువల్ల తాగునీటి కేటాయింపులను కేవలం 20 శాతంగానే పరిగణనలోకి తీసుకోవాలని బచావత్ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. దాని ప్రకారం కృష్ణా జలాల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 16 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
- ఏటా తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన కృష్ణా జలాలను క్యారీ ఓవర్‌గా పరిగణించి మరుసటి ఏడాది ఆ నీటిని వాడుకొనే వెసులుబాటు కల్పించాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

